భారతదేశం, మార్చి 6 -- ఓటీటీలోకి ఓ ఇంట్రెస్టింగ్ తెలుగు కామెడీ ఎమోషనల్ డ్రామా రాబోతోంది. ఈ సినిమా పేరు నవాబ్ కేఫ్. ఈ సినిమాను మార్చి 12 నుంచి ఈటీవీ విన్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ శుక్రవారం (మార్చి 6) వెల్లడించింది. మరి ఆ వివరాలు, మూవీ స్టోరీ, ఇతర విశేషాలను ఇక్కడ చూడండి.

రాజీవ్ కనకాల, శివ కందుకూరిలాంటి వాళ్లు నటించిన మూవీ నవాబ్ కేఫ్. ఫిబ్రవరి 20న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాను మార్చి 12 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈటీవీ విన్ వెల్లడించింది. "నవాబ్స్ కేఫ్.. కుటుంబం, కలలు, వారసత్వంలాంటి మనసుకు హత్తుకునే స్టోరీకి కామెడీని జోడించి చెప్పిన సినిమా. మార్చి 12న ప్రీమియర్ అవుతుంది" అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.

హైదరాబాద్ పాతబస్తీ సంస్కృతికి అద్దం పట్టే ఇరానీ ఛాయ్, ఆ ఛాయ్ చుట్టూ అల్లుకున్న జ్ఞాపకాల నేపథ్యంలో తెరకెక్కిన ...