భారతదేశం, జూలై 25 -- Nara Rohith: తెలుగు సినీ పరిశ్రమలో విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' వంటి ఆల్-టైమ్ క్లాసిక్స్‌కి రచయితగా పనిచేసిన త్రివిక్రమ్.. తొలిసారిగా వెంకటేష్‌ను డైరెక్ట్ చేస్తున్న ప్రాజెక్ట్ 'ఆదర్శ కుటుంబం' (AK47). ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా, తాజాగా నారా రోహిత్ ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్ మల్టీస్టారర్ రేంజ్ హైప్‌ను సొంతం చేసుకుంది.

నారా రోహిత్ కెరీర్‌లో 'రౌడీ ఫెలో', 'అసుర', 'ప్రతినిధి' వంటి చిత్రాలు అతని నటనలోని గంభీరతను, విలక్షణమైన డైలాగ్ డెలివరీని నిరూపించాయి. ఖాకీ డ్రెస్ వేస్తే అతని బాడీ లాంగ్వేజ్‌కు లభించే ఎలివేషనే వేరు. ఇప్పుడు త్రివిక్రమ్ మార్క్ క్యారెక్టరైజేషన్‌లో నారా రోహిత్ ఒక సీరియస్ అండ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ...