భారతదేశం, ఫిబ్రవరి 28 -- ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో తన ఆధిపత్యాన్ని చాటుతూ గూగుల్ మరో కీలక అడుగు వేసింది. తన శక్తివంతమైన ఇమేజ్ జనరేషన్ మోడల్ 'నానో బనానా'కు అప్‌గ్రేడెడ్ వెర్షన్ అయిన 'నానో బనానా 2'ను ప్రపంచవ్యాప్తంగా ఇటీవలే అందుబాటులోకి తెచ్చింది. ఇది జెమినీ యాప్‌లోని ఫాస్ట్, థింకింగ్, ప్రో మోడ్‌లలో డిఫాల్ట్ ఆప్షన్‌గా పనిచేస్తుందని సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ నానో బనానా 2 విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..

"జెమినీ ఫ్లాష్ వేగవంతమైన మేధస్సును విజువల్ జనరేషన్‌కు జోడించడమే నానో బనానా 2 లక్ష్యం అని చెప్పుకోవాలి. దీనివల్ల వేగవంతమైన ఎడిటింగ్, అత్యుత్తమ నాణ్యత గల చిత్రాలను సృష్టించడం సాధ్యమవుతుంది," అని గూగుల్ తన ప్రకటనలో పేర్కొంది. గతంలో కేవలం 'ప్రో' వెర్షన్‌కే పరిమితమైన ఫీచర్లను ఇప్పుడు సాధారణ వినియోగదారులకు కూడా అందుబాటులోకి తెచ్చా...