భారతదేశం, నవంబర్ 29 -- Nani Promise: ఓ వైపు హీరోగా దూసుకెళ్తూనే మరోవైపు ప్రొడ్యూసర్ గానూ వరుసగా సినిమాలు తీస్తున్నారు నేచురల్ స్టార్ నాని. ఆయన సమర్ఫణలో వస్తున్న అప్ కమింగ్ మూవీ 'అలియాస్ రుక్మిణీ'. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది. ఈ ఈవెంట్లో నాని ఇచ్చిన ఓ ప్రామిస్ ఇప్పుడు వైరల్ గా మారింది.

అలియాస్ రుక్మిణి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాని కామెంట్లు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ''డిసెంబర్ 4న అలియాస్ రుక్మిణికి వెళ్లి.. థియేటర్ల నుంచి బయటకొస్తూ మీరొక బ్యూటీఫుల్ సినిమాను చూశామనే ఫీలింగ్ మీకు కలగకపోతే నేను ఇక నుంచి సినిమాలు తీయడం మానేస్తాను. సుమగారు యాంకరింగ్ మానేస్తారు. ఇది ఉమ్మడి హామీ'' అని నాని చెప్పారు.

ఈ మాటలు చెప్పగానే పక్కనే ఉన్న సుమ షాక్ అయింది. తన మీద చేయి పెట్టారు కాబట్టి ఇది కంబైన్డ్...