భారతదేశం, సెప్టెంబర్ 19 -- Nani Comments: నేచురల్ స్టార్ నాని అప్ కమింగ్ మూవీ ది ప్యారడైజ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా కొచ్చిలో జరిగిన ప్రెస్ మీట్‌లో నాని మలయాళ చిత్రపరిశ్రమపై ప్రశంసల వర్షం కురిపించారు. మలయాళం ఇండస్ట్రీని చూసి చాలా నేర్చుకోవాలంటూ నాని చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సెప్టెంబర్ 24, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న 'ది ప్యారడైజ్' సినిమా ప్రమోషన్లలో భాగంగా నేచురల్ స్టార్ నాని కేరళలోని కొచ్చిలో పర్యటించారు. అక్కడ మీడియాతో మాట్లాడారు. మలయాళ చిత్రపరిశ్రమ పనితీరును, వారి ప్రొడక్షన్ ప్లానింగ్‌ను కొనియాడారు.

ఎంతటి పరిమిత వనరులు ఉన్నప్పటికీ, వాటిని సమర్థవంతంగా వినియోగించుకుంటూ అద్భుతమైన క్వాలిటీ కంటెంట్‌ను ఎలా అందించవచ్చో మలయాళ చిత్రసీమ నిరూపిస్తోందన...