భారతదేశం, సెప్టెంబర్ 5 -- Nani: ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా క్లాప్ బాయ్‌గా కెరీర్ ప్రారంభించి, నేడు పాన్ ఇండియా లెవల్ కు ఎదిగిన స్టార్ నాని. టాలీవుడ్ లో 'మినిమమ్ గ్యారెంటీ బ్రాండ్'గా ఎదిగిన నేచురల్ స్టార్ నాని (Nani) చిత్ర పరిశ్రమలో 18 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయన ఫస్ట్ మూవీ 'అష్టాచెమ్మా' 2028లో సెప్టెంబర్ 5న రిలీజైంది.

సినిమా ఇండస్ట్రీలో హీరోగా 18 ఏళ్లు కంప్లీట్ చేసిన నాని.. ఇవాళ (సెప్టెంబర్ 5) ఎమోషనల్ ట్వీట్ పెట్టారు.

"18 ఏళ్లు.. సినిమాల్లో అఫీషియల్ గా అడల్ట్ (పెద్దవాడిని) అయ్యాను. మీరు నాపై చూపించిన ప్రేమను నేనెప్పుడూ తేలికగా తీసుకోలేదు. ఎప్పటికీ తీసుకోను కూడా'' అని నాని ఎక్స్ లో పోస్టు పెట్టారు. గాల్లో ఎగురుతున్న తుపాకుల మధ్యలో తాను ఉన్న ది ప్యారడైజ్ వీడియోను షేర్ చేశారు.

తెలుగు ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్లు లేకుండా సొంత ప్రత...