భారతదేశం, సెప్టెంబర్ 23 -- Nani: ది ప్యారడైజ్ ప్రీమియర్ కోసం నాని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కు వస్తారా లేదా? అన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని ఒక ఐకానిక్ థియేటర్‌లో ఈ రోజు (సెప్టెంబర్ 23) రాత్రి 'ది ప్యారడైజ్' ప్రీమియర్ షోను అభిమానులతో కలిసి చూడాలని నేచురల్ స్టార్ నాని భావించారు. దీనికోసం ప్రత్యేక అనుమతి ఇవ్వాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

నాని అభ్యర్థనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. స్థానిక పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆ అప్లికేషన్ ను, పరిస్థితిని బట్టి పోలీసులు నిర్ణయం తీసుకుంటారని రేవంత్ ట్వీట్ చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేసిన తర్వాత తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ కూడా ఎక్స్ లో రియాక్టయ్యారు. ''నాని, ఓదెల.. గణేష్ నిమజ్జనాలు జోరు మీద సా...