భారతదేశం, మే 31 -- నల్లమల అడవుల్లో దాగివున్న చారిత్రక, సాంస్కృతిక సంపదను వెలికితీసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నల్లమల అటవీ ప్రాంతంలో శాసనాలు, ఇతర సాంస్కృతిక వారసత్వ సంపదపై సర్వే నిర్వహించేందుకు భారత పురావస్తు శాఖ(ASI) కు ఏపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.

ఈ విషయాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ సర్వేకు సంబంధించి పూర్తి వివరాలు, దాని ప్రాధాన్యత క్రింది విధంగా ఉన్నాయి.

నల్లమల అడవుల్లో సర్వే నిర్వహించనున్న ఏఎస్ఐ (ASI) బృందానికి అవసరమైన పూర్తి సహకారాన్ని అందించాలని అటవీ శాఖ అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అడవుల సంరక్షణ అనేది కేవలం జీవవైవిధ్యం పరంగానే కాకుండా, దట్టమైన అరణ్యాల్లో దాగి ఉన్న చారిత్రక, పురావస్తు, సాంస్కృతిక నిధు...