భారతదేశం, మే 23 -- Nagarjuna: టాలీవుడ్ మన్మధుడు, కింగ్ అక్కినేని నాగార్జున సినీ ప్రస్థానంలో మే 23వ తేదీకి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. అక్కినేని అభిమానులకు ఈ రోజు ఒక పండగ లాంటిది. నాగార్జున హీరోగా వెండితెరకు పరిచయమైన రోజు, అలాగే అక్కినేని మూడు తరాల నటులు కలిసి నటించిన అద్భుత కావ్యం 'మనం' విడుదలైన రోజు కూడా ఇదే కావడం విశేషం.

కింగ్ అక్కినేని నాగార్జున తన సినీ కెరీర్ లో 40 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా అరుదైన డబుల్ మైలురాయిని పురస్కరించుకుని నాగార్జునతో పాటు ఆయన కుమారులు నాగ చైతన్య, అఖిల్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న భావోద్వేగ సందేశాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తన సుదీర్ఘ సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ నాగార్జున ఎంతో భావోద్వేగానికి లోనయ్యాడు.

"నా సినీ జీవితం మొదలైన రోజిది. నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని తేదీ మే ...