భారతదేశం, ఆగస్టు 19 -- Nagarjuna: హీరోలకు రూ. 100 కోట్లు, రూ. 150 కోట్లు పారితోషికం ఇస్తున్నారంటూ సోషల్ మీడియాలో వచ్చే వార్తలన్నీ ఒట్టి పుకార్లేనని కింగ్ అక్కినేని నాగార్జున తెగేసి చెప్పారు. మీడియాలో ప్రచారమయ్యే భారీ పారితోషికాల సంఖ్యల్లో కనీసం 50 శాతం కూడా హీరోలకు దక్కదని, ఇండస్ట్రీలో ఇదంతా కేవలం ఓవర్ హైప్ క్రియేషన్ మాత్రమేనని బాంబ్ పేల్చారు.

తన ల్యాండ్‌మార్క్ 100వ సినిమా 'కింగ్ 100' షూటింగ్ అప్‌డేట్‌తో పాటు అక్కినేని హీరోల క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్టులపై నాగ్ సంచలన విషయాలు పంచుకున్నారు. వెరైటీ ఇండియా ఇంటర్వ్యూలో నాగార్జున ఏమన్నారో చూడండి.

హీరోలు రెండేళ్లకు ఒక సినిమా చేయడం వల్ల సినిమా బిజినెస్ తీవ్రంగా దెబ్బతింటోందని నాగార్జున స్పష్టం చేశారు. అందుకే పెద్ద హీరోలు ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేయాలని కోరారు. సరైన ప్రీ-ప్రొడక్షన్ ప్లాని...