భారతదేశం, జూలై 6 -- Nagarjuna:మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన రా అండ్ మాస్ ఎమోషనల్ డ్రామా 'లెనిన్' ప్రమోషన్స్ పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రాగా, ఆదివారం (జూలై 5) రాత్రి తిరుపతిలో నిర్వహించిన ప్రీ-రిలీజ్ వేడుకతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన కింగ్ నాగార్జున అక్కినేని.. అభిమానుల్లో పూనకాలు తెప్పించేలా మాట్లాడాడు.

లెనిన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కింగ్ నాగార్జున మాట్లాడుతూ సినిమాపై ఇన్ సైడ్ రిపోర్ట్స్‌ను పంచుకున్నారు.

"దర్శకుడు నందు (మురళి కిషోర్) మొదట నాకు కథ చెప్పినప్పుడు చాలా నచ్చింది. ప్రతీ పాత్రలో రకరకాల కోణాలున్నాయి. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులను ఎవరూ ఊహించలేరు. ఇది మన సీమ కథ, సీమ మట్టి కథ, సీమలో జరుగుతున్న మహాభారతం'...