భారతదేశం, జూలై 23 -- Nagabandham OTT: ఎన్నో అంచనాల మధ్య ఏకంగా రూ. 110 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన మైథాలజికల్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ 'నాగబంధం' (Nagabandham) సైలెంట్‌గా డిజిటల్ ఎంట్రీకి రెడీ అయింది. జులై 3న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణమైన డిజాస్టర్‌గా నిలిచింది. ఆడియన్స్ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన ఈ ప్రాజెక్ట్.. థియేట్రికల్ రిలీజ్ అయిన కేవలం 21 రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తోంది.

యంగ్ హీరో విరాట్ కర్ణ, గ్లామరస్ భామలు నభా నటేష్, ఐశ్వర్య మీనన్ లీడ్ రోల్స్ చేసిన నాగబంధం సినిమా ప్రముఖ ఓటీటీ జెయింట్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ శుక్రవారం అంటే జులై 24 నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్‌కు అందుబాటులోకి రాబోతోంది. అయితే హిందీ వెర్షన్...