భారతదేశం, మార్చి 5 -- టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య మరోసారి ఓ భిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈసారి మిస్టికల్ థ్రిల్లర్ స్టోరీ లైన్ తో వస్తున్న వృషకర్మ మూవీలో లీడ్ రోల్ పోషిస్తున్నాడు. ఈ సినిమా తన కెరీర్లోనే బెస్ట్ మూవీ అని అతడు అనడం విశేషం. తండేల్ ను మించి ఉంటుందని స్పష్టం చేశాడు.

వృషకర్మ గ్లింప్స్ వీడియో రిలీజ్ ఈవెంట్ లో నాగ చైతన్య పాల్గొన్నాడు. ఈ సినిమాలో తాను అర్జున్ అనే పాత్ర పోషిస్తున్నానని, ఆ పాత్ర గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లోనే డైరెక్టర్ కార్తీక్ దండు తనకు 100 ప్రశ్నలు పంపించాడని చైతూ చెప్పాడు.

ఆ ప్రశ్నలకు తనను సమాధానాలు రాయమన్నాడని, కార్తీక్ కూడా రాశాడని, ఇద్దరి సమాధానాలు చూసి ఈ పాత్రపై ఎంత వరకూ కనెక్ట్ అయి ఉన్నామో చూద్దామని చెప్పినట్లు చైతన్య తెలిపాడు. అంతలా అర్జున్ పాత్ర గురించి తాము వ...