భారతదేశం, ఏప్రిల్ 24 -- Naga Babu: జనసేన పార్టీలో ప్రస్తుతం అంతర్గత పరిణామాలు కాస్త వేడెక్కాయి. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు పవన్ కళ్యాణ్ అహర్నిశలు శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నాయకుడి కష్టానికి తగినట్లుగా కింది స్థాయి నాయకత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదనే అసంతృప్తి పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. తాజాగా జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, మెగా బ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. పార్టీ నేతల తీరుపై ఆయన బహిరంగంగానే తన అసహనాన్ని వ్యక్తం చేశారు.

పార్టీ నాయకులు కేవలం మైకుల ముందు మాట్లాడటానికే పరిమితం అవుతున్నారని, క్షేత్రస్థాయిలో నాయకుడి పట్ల వారికి ఉండాల్సిన కనీస ఆత్మీయత లోపించిందని నాగబాబు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆర...