భారతదేశం, మార్చి 31 -- భారతీయ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ 'ధురంధర్: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ స్పై థ్రిల్లర్, విడుదలైన కేవలం ఏడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్ల మార్కును దాటి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ.. రెండో వారంలోనూ అదే జోరును కొనసాగిస్తూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో ధురంధర్ 2పై తాజాగా మరో తెలుగు దర్శకుడు నాగ్ అశ్విన్ తన రివ్యూ ఇచ్చాడు.

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై విజువల్ వండర్ 'కల్కి 2898 AD'ని ఆవిష్కరించిన దర్శకుడు నాగ్ అశ్విన్.. తాజాగా 'ధురంధర్ 2'పై తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. సినిమాలోని యాక్షన్ సీన్ల కంటే అందులోని ఎమోషన్ తనను బాగా ఆకట్టుకుందని అతడు పేర్కొ...