భారతదేశం, జూన్ 11 -- Mutual Fund SIP Common Mistakes : షేర్ మార్కెట్​లో టైమింగ్ కోసం ఎదురుచూడటం కంటే.. క్రమశిక్షణతో కూడిన పెట్టుబడులు పెట్టడం వల్ల ఎక్కువ లాభాలు వస్తాయా? అంటే.. ఖచ్చితంగా వస్తాయని ప్రస్తుత ట్రెండ్స్ రుజువు చేస్తున్నాయి. ఇందుకు ఉదాహరణే.. మ్యూచువల్​ ఫండ్​ సిప్​. భారతదేశంలోని సాధారణ రిటైల్ ఇన్వెస్టర్లకు ఈ 'సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్' (సిప్) ఒక అద్భుతమైన సంపద సృష్టి సాధనంగా మారింది. ఆర్థిక రంగంపై పెరుగుతున్న అవగాహన, సులభతరమైన డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, దీర్ఘకాలిక లక్ష్యాలపై ఇన్వెస్టర్లకు ఏర్పడిన నమ్మకం వల్ల ఎస్‌ఐపీల ప్రజాదరణ రోజురోజుకూ పుంజుకుంటోంది.

అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం.. గత దశాబ్ద కాలంలో సిప్ పెట్టుబడులు ఊహించని స్థాయిలో వృద్ధి చెందాయి. రిటైల్ ఇన్వెస్...