భారతదేశం, నవంబర్ 23 -- మ్యూచువల్ ఫండ్స్​లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) ప్రారంభించేటప్పుడు ప్రతి ఒక్కరి మదిలో మెదిలే మొదటి ప్రశ్న.. నెలలో ఏ తేదీని ఎంచుకోవాలి? జీతం పడే ఒకటో తేదీనా, లేక ఐదో తేదీనా, మధ్యలో 15వ తేదీనా, లేదంటే నెలాఖరున 25వ తేదీన పెట్టుబడి పెడితే ఎక్కువ లాభం వస్తుందా? చాలామంది పెట్టుబడిదారులు ఏదో ఒక అదృష్ట తేదీని పట్టుకుంటే దీర్ఘకాలంలో అద్భుతమైన రాబడి వస్తుందని భావిస్తుంటారు. అయితే చారిత్రక సెన్సెక్స్ గణాంకాలు మాత్రం ఇందుకు భిన్నమైన వాస్తవాన్ని చెబుతున్నాయి. మీరు ఏ తేదీన సిప్ కట్టినా దీర్ఘకాలిక రాబడిలో వచ్చే తేడా నామమాత్రమేనని 'వైట్‌ఓక్ క్యాపిటల్ మ్యూచువల్ ఫండ్' తాజా అధ్యయనం స్పష్టం చేసింది! 10 ఏళ్ల సగటు మ్యూచువల్ ఫండ్ సిప్ రాబడి వివిధ తేదీల్లో దాదాపు ఒకేలా ఉందని ఈ విశ్లేషణ నిరూపించింది.

వివిధ తేదీలలో చేసిన నెలవా...