భారతదేశం, జూన్ 21 -- Muthassi Ott: హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే సౌత్ ప్రేక్షకులకు అదిరిపోయే సర్ప్రైజ్ రాబోతుంది. కేరళ రూటెడ్ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన మలయాళ హారర్ వెబ్ సిరీస్ 'ముత్తశ్శి' (Muthassi) డిజిటల్ స్ట్రీమింగ్‌కు లైన్ క్లియర్ చేసుకుంది. అదిరిపోయే ట్విస్ట్ లతో ఈ వెబ్ సిరీస్ సాగుతుందని టాక్.

మలయాళ హారర్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ 'ముత్తశ్శి' స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 (ZEE5)లో రిలీజ్ కానుంది. జూన్ 26 నుంచి ఈ సిరీస్ అఫీషియల్‌గా జీ5 ఓటీటీ స్క్రీన్స్‌పైకి రానుంది.

కేరళ, కర్ణాటక సరిహద్దుల్లోని ఒక మారుమూల 'తులు' (Tulu) గ్రామం నేపథ్యంలో నందులాల్ ఎంఎస్ ఈ 'ముత్తశ్శి' సిరీస్‌ను అత్యంత భయంకరంగా విజువలైజ్ చేశారు. లీల (కేపీఏసీ లీల) అనే ఒక నిబద్ధత గల తల్లి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తన ఏక...