భారతదేశం, సెప్టెంబర్ 30 -- Musafir Cafe: '12thఫెయిల్' సినిమాతో నేషనల్ వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసిన బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ విక్రాంత్ మాస్సే (Vikrant Massey) ఒక సరికొత్త అవతారం ఎత్తుతున్నారు. తన హిట్ వెబ్ సిరీస్ 'ముసాఫిర్ కేఫే' (Musafir Cafe) నుంచి ఇన్‌స్పైర్ అయి, తన భార్య శీతల్ ఠాకూర్‌తో కలిసి రియల్ లైఫ్‌లో కేఫేలను ప్రారంభించడానికి సిద్ధమయ్యారు.

నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ముసాఫిర్ కేఫే వెబ్ సిరీస్ మీరు చూశారా? అందులో చూపించినది ఇప్పుడు రియల్ లైఫ్ లోకీ రాబోతోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని అందమైన ధర్మశాల, అలాగే ఉత్తరాఖండ్ ప్రశాంతమైన హిల్ స్టేషన్లలో విక్రాంత్ మాస్సే ఈ కేఫేలను ప్లాన్ చేస్తున్నారు.

మిడ్-డే రిపోర్ట్ ప్రకారం.. 'ముసాఫిర్ కేఫే' వెబ్ సిరీస్‌లో విక్రాంత్.. 'చందర్' పాత్రలో కనిపించిన కేఫే థీమ్‌తోనే ఈ రెండింటిని డిజైన్ చ...