భారతదేశం, జూన్ 9 -- MS Subbulakshmi Biopic: కర్నాటక సంగీత సామ్రాజ్ఞి, భారతరత్న ఎమ్‌ఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్‌లో నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్నట్లు వస్తున్న వార్తలు టాలీవుడ్‌లో సంచలనంగా మారాయి. 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాబోతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం రష్మికకు సీక్రెట్‌గా 'లుక్ టెస్ట్' కూడా పూర్తయినట్లు ఇన్సైడ్ టాక్.

అయితే ఈ ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ కోసం అంతకుముందు సాయి పల్లవి, రుక్మిణి వసంత్ వంటి క్లాసికల్ యాప్ట్ ఫేసెస్ వినిపించినా.. ఫైనల్‌గా రష్మిక మందన్న వైపు మేకర్స్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇందుకు గల బలమైన కమర్షియల్, ట్రేడ్ కారణాలు ఏంటో ఇక్కడ చూద్దాం.

ఒక క్లాసికల్ సింగర్ బయోపిక్ అనగానే అందరికీ మొదట గుర్తొచ్చే పేరు సాయి పల్లవి. అద్భుతమైన నటన, సాంప్రదాయ రూపం ఆమె సొంతం. అలాగే కన్నడ బ్యూటీ రుక్మిణి ...