Money: నెలాఖరుకు డబ్బు మిగలట్లేదా? ఎంత జీతం వచ్చినా ప్రయోజనం లేదు.. ఈ ఒక్క అలవాటు లేకపోతే!
భారతదేశం, జూన్ 20 -- నేటి కాలంలో డబ్బు మనిషి ప్రాథమిక అవసరంగా మారింది. మెరుగైన జీవన ప్రమాణాలు, పిల్లల చదువులు, సొంత ఇల్లు, వాహనాల కోసం ప్రతి ఒక్కరూ నిరంతరం కష్టపడుతుంటారు. ఎక్కువ ఆదాయం ఉంటేనే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చాలామంది భావిస్తారు. అయితే, ఇది పూర్తిగా వాస్తవం కాదు. అధిక జీతాలు వస్తున్నా, నెల చివరకు వచ్చే సరికి చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బందిపడే వారు ఎందరో ఉన్నారు. మరోవైపు, పరిమిత ఆదాయంతోనే పొదుపును, ఖర్చులను సమతుల్యం చేసుకుంటూ హాయిగా జీవించే వారూ ఉన్నారు. కాబట్టి, సంపాదనకంటే ఆర్థిక నిర్వహణే ముఖ్యం.
ఆర్థిక నిపుణుల విశ్లేషణ ప్రకారం, ఆదాయం పెరిగే కొద్దీ ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరిగిపోవడం చాలామంది చేస్తున్న అతిపెద్ద పొరపాటు. ఆన్‌లైన్ షాపింగ్ ఆఫర్లు, క్రెడిట్ కార్డుల వినియోగం, ఆధునిక జీవనశైలి కోసం చేసే అనవసర ఖర్చులు పొదుపు మార్గంల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.