భారతదేశం, ఏప్రిల్ 25 -- Mohini Ekadashi 2026 : హిందూ ధర్మంలో ఏకాదశి తిథికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. అందులోనూ వైశాఖ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని 'మోహినీ ఏకాదశి'గా పిలుస్తారు. పురాణాల ప్రకారం.. క్షీరసాగర మథనం సమయంలో ఆవిర్భవించిన అమృతాన్ని అసురుల బారి నుంచి కాపాడేందుకు శ్రీమహావిష్ణువు మోహిని అవతారాన్ని ధరించిన రోజే ఈ మోహినీ ఏకాదశి. ఈ ఏడాది ఏప్రిల్ 27వ తేదీన ఈ పర్వదినం ఉంది. ఈ రోజున భక్తులు చేసే ఉపవాసం, దానధర్మాలు కోటి పుణ్యఫలాలతో సమానమని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

ఈ ఏడాది మోహినీ ఏకాదశి రోజు 'ధ్రువ యోగం' ఏర్పడుతోంది. ఈ శుభ యోగంలో చేసే విష్ణు ఆరాధన, జప తపాలు రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయి. జీవితంలో ఆనందం, శ్రేయస్సు కోరుకునే వారు ఈ రోజున తెల్లవారుజామునే స్నానాదికాలు ముగించుకుని, వీలైతే నీటిలో గంగాజలం కలుపుకుని స్నానం చేయాలి. విష్ణుమూర్...