భారతదేశం, ఏప్రిల్ 27 -- హిందూ ధర్మంలో ఏకాదశి తిథికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో వైశాఖ మాస శుక్ల పక్షంలో వచ్చే 'మోహినీ ఏకాదశి' అత్యంత శక్తివంతమైనదిగా పండితులు చెబుతుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 27, సోమవారం నాడు అనగా ఈరోజు ఈ పర్వదినాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువును ఆరాధిస్తే, తెలిసో తెలియక చేసిన పాపాలన్నీ నశించి, సుఖసంతోషాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. సాక్షాత్తు శ్రీరామచంద్రుడు, ధర్మరాజు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లు మన పురాణాల్లో పేర్కొన్నారు.
జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం.. వైశాఖ శుక్ల ఏకాదశి తిథి ఏప్రిల్ 26వ తేదీ సాయంత్రం 06:08 గంటలకు ప్రారంభమై, ఏప్రిల్ 27వ తేదీ రాత్రి 09:19 గంటల వరకు ఉంటుంది. సూర్యోదయ తిథిని పరిగణనలోకి తీసుకుంటే, ఏప్రిల్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.