భారతదేశం, మార్చి 22 -- భారతీయ సినీ చరిత్రలో ఒక అరుదైన క్షణం ఆవిష్కృతం కాబోతోంది. మలయాళ సినీ దిగ్గజం మోహన్ లాల్, ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కలిసి హిస్టరీ క్రియేట్ చేయబోతున్నారు. డైరెక్టర్ గా ప్రియదర్శన్ 100వ సినిమలో మోహన్ లాల్ హీరో. దశాబ్దాల కాలంగా వీరిద్దరి కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తూనే ఉంది.

సాధారణంగా ఒక దర్శకుడి మొదటి సినిమాలో నటించిన హీరోనే, అతని 100వ సినిమాలో కూడా నటించడం అనేది భారతీయ సినిమాలో చాలా అరుదు. ప్రియదర్శన్ దర్శకుడిగా పరిచయమైన మొదటి చిత్రంలో మోహన్ లాల్ కథానాయకుడు. ఇప్పుడు అదే కాంబినేషన్ 100వ మైలురాయిని చేరుకోవడం ఒక రికార్డుగా నిలిచిపోనుంది.

1984లో డైరెక్టర్ గా ప్రియదర్శన్ ఫస్ట్ మూవీ రిలీజ్ అయింది. దీని పేరు 'పూచక్కోరు ముక్కూతి'. ఇందులో మోహన్ లాల్ హీరో.

ప్రియదర్శన్, మోహన్ లాల్ అనగానే మనకు వెంటనే వారి అద...