భారతదేశం, ఆగస్టు 19 -- Modern Missamma Title Song: లాస్య అండ్ మిధున క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'మోడ్రన్ మిస్సమ్మ' ఫస్ట్ సింగిల్ ప్రసాద్ ల్యాబ్స్‌లో గ్రాండ్‌గా లాంచ్ అయింది. హర్ష నర్రా, తన్మయి ఖుషి జంటగా నటిస్తున్న ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ స్వరాలు సమకూర్చారు. 'బెటర్ బీ ఏ మిస్సమ్మ' అంటూ సాగే ఈ పాట విడుదలైన క్షణం నుంచే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన మోడ్రన్ మిస్సమ్మ ఫస్ట్ సింగిల్ రిలీజ్ వేడుకలో మూవీ టీమ్ ఈ సాంగ్ విడుదల చేసింది. కిట్టు విస్సాప్రగడ రాసిన ఈ పాటలో హీరో సంప్రదాయ పంచెకట్టులో కనిపిస్తే, హీరోయిన్ తన్మయి ట్రెడిషనల్ లుక్‌లో ఆకట్టుకుంది.

'మన్మథుడు' సినిమాలో నాగార్జున 'వద్దురా సోదరా' పాట మగవాళ్లకు ఎంతలా కనెక్ట్ అయిందో, ఈ పాట అమ్మా...