భారతదేశం, సెప్టెంబర్ 28 -- Mithun Chakraborty: నేషనల్ అవార్డ్ విన్నర్, దాదాసాహెబ్ ఫాల్కే గ్రహీత, బాలీవుడ్ 'మహాగురు' మిథున్ చక్రవర్తి కెరీర్ ప్రారంభంలో పడిన కష్టాలు వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఆకలి తీర్చుకోవడానికి నైట్ పార్టీల్లో ఫ్రీగా డాన్స్ చేయడం నుంచి ఫుట్‌పాత్‌లపై నిద్రపోవడం వరకు ఆయన జీవితంలో ఎన్నో కన్నీటి ఘట్టాలు ఉన్నాయి.

జూనియర్ ఆర్టిస్ట్‌గా ప్రయాణం మొదలుపెట్టి మెగాస్టార్‌గా ఎదిగిన ఈ దిగ్గజ నటుడి రియల్ స్ట్రగుల్ లైఫ్ గురించి ఫరా ఖాన్ వ్లాగ్ లో సంచలన విషయాలు బయటపడ్డాయి. సినిమా ఇండస్ట్రీలో ఏ అగ్ర హీరోకూ లేని అత్యంత కష్టతరమైన గతాన్ని దాటుకుని మిథున్ చక్రవర్తి ఈ స్థాయికి చేరుకున్నారు.

బాలీవుడ్ ప్రముఖ ఫిల్మ్ మేకర్, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ తన యూట్యూబ్ ఛానెల్ లో మిథున్ చక్రవర్తితో మాట్లాడిన విశేషాలను పంచుకున్నారు. ఫరా ఖాన్ చిన్నతనంలో ...