భారతదేశం, మార్చి 7 -- ఇరాన్​పై- అమెరికా, ఇజ్రాయెల్​ దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఫలితంగా మన దేశంలో ఇప్పటికే ఎల్​పీజీ సిలిండర్​ ధరలు పెరిగాయి. నెక్ట్స్​ పెట్రోల్​, డీజిల్​ ధరలు పెరుగాయా? అన్న ఆందోళనలు అందరిలోనూ ఉన్నాయి. వాస్తవానికి ఇంధన ధరలు పెరుగాయేమో అన్న భయం సామాన్యుడికి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అందుకే చాలా మంది వాహనం కొనే సమయంలో అధిక మైలేజ్​ ఇచ్చే ఆప్షన్లను వెతుకుతుంటారు.

భారతదేశంలో ఫ్యూయెల్​ సేవింగ్స్​ అనేది మీ మొదటి ప్రాధాన్యత అయితే, 'స్ట్రాంగ్ హైబ్రిడ్' కార్లు ఖచ్చితంగా అత్యుత్తమ ఎంపికగా నిలుస్తాయి. ఇవి పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీల కలయికతో పనిచేస్తాయి. దీనివల్ల తక్కువ వేగంతో వెళ్లేటప్పుడు లేదా సిటీ ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు కారు కేవలం ఎలక్ట్రిక్ పవర్‌తోనే నడుస్తుంది. దీనికి ప్లగ్-ఇన్ ఛార...