భారతదేశం, ఫిబ్రవరి 10 -- ఎవరు ఏ కారు కొన్నా, కొనాలని ప్లాన్​ చేస్తున్నా ముందుగా వినిపించే ప్రశ్న.. "ఎంత మైలేజీ​ ఇస్తుంది?" అని. సేఫ్టీ- ఆధునిక సాంకేతిక ముఖ్యమే అయినప్పటికీ ఒక కారు కొనేందుకు భారతీయులు ఇప్పటికీ చూస్తున్న మొదటి విషయం మైలేజీ అని అనడంలో సందేహమే లేదు​. మరీ ముఖ్యంగా ఇంధన ఖర్చులు ఎక్కువగా ఉంటున్న నేటి కాలంలో ఆ భారాన్ని తగ్గించుకునేందుకు చాలా మంది అధిక మైలేజీ ఇచ్చే వాహనాలు కొనేందుకు మొగ్గుచూపుతున్నారు. వీరిలో మీరూ ఉన్నారా? అయితే ఇది మీకోసమే. ఇండియాలో ప్రస్తుతం లభిస్తున్న టాప్​- 5 హై మైలేజీ​ కార్ల (పెట్రోల్​/ హైబ్రిడ్​) వివరాలను ఇక్కడ చూసేయండి..

1. మారుతీ సుజుకీ విక్టోరిస్

ప్రస్తుతం ఇండియాలో అత్యధిక మైలేజీ ఇచ్చే కారుగా మారుతీ సుజుకీ విక్టోరిస్ రికార్డు సృష్టించింది! ఇది ఒక మిడ్-సైజ్ ఎస్​యూవీ అయినప్పటికీ, దీనిలోని 'స్ట్రాంగ్ హైబ్ర...