భారతదేశం, అక్టోబర్ 27 -- ఐటీ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న దిగ్గజ సంస్థ 'మైక్రోసాఫ్ట్' టెక్ ప్రపంచంలో మరో పెద్ద సంచలనానికి తెరతీసింది! ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) యుగానికి అనుగుణంగా తమ సంస్థను పునర్వ్యవస్థీకరించే క్రమంలో, అలాగే ఖర్చులను గణనీయంగా తగ్గించుకునేందుకు సుమారు 60,000 మంది ఉద్యోగులకు 'బైఅవుట్ ప్యాకేజీ' ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది.

హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్ డెవలప్‌మెంట్ సెంటర్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ టెక్కీలను ఈ నిర్ణయం ప్రభావితం చేయనుంది. అమెరికా, కెనడా, బ్రిటన్, భారత్‌లోని వైస్ ప్రెసిడెంట్ (వీపీ) స్థాయి, ఆ దిగువ స్థాయిలో ఉన్న అర్హులైన ఉద్యోగులకు ఈ బైఅవుట్ ఆఫర్ అందుబాటులో ఉంటుందని మైక్రోసాఫ్ట్ ప్రతినిధి వెల్లడించారు.

ఈ బైఅవుట్ ప్యాకేజీని తీసుకునే వారు మైక్రోసాఫ్ట్​ నుంచి వాలంటరీగా ఎగ్జిట్​ అవుతున్నట్టు అర్...