భారతదేశం, ఏప్రిల్ 22 -- Michael Jackson Biopic Movie: పాప్ సంచలనం మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'మైఖేల్' సినిమాపై రివ్యూలు వచ్చేశాయి. జాఫర్ జాక్సన్ నటన అద్భుతంగా ఉన్నప్పటికీ, కథనం విషయంలో విమర్శకులు పెదవి విరుస్తున్నారు. దీంతో రోటెన్ టొమాటోస్ లో ప్రస్తుతానికి దీనికి కేవలం 35 శాతం రేటింగ్ మాత్రమే నమోదైంది.

ప్రపంచవ్యాప్తంగా పాప్ మ్యూజిక్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మూవీ 'మైఖేల్'. ఆంటోనీ ఫుక్వా దర్శకత్వంలో, మైఖేల్ జాక్సన్ మేనల్లుడు జాఫర్ జాక్సన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ బయోపిక్ ప్రీమియర్ షోల తర్వాత మిశ్రమ స్పందనను మూటగట్టుకుంది.

ముఖ్యంగా ప్రముఖ రివ్యూ సైట్ 'రోటెన్ టొమాటోస్' (Rotten Tomatoes)లో ఈ సినిమా కేవలం 27 శాతం రేటింగ్‌తో జర్నీ మొదలుపెట్టడం ఇప్పుడు హాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఈ రేటింగ్ స్వల్పంగా పెర...