భారతదేశం, ఏప్రిల్ 18 -- Meta Layoffs 2026 : ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో ఉద్యోగాల తొలగింపు పర్వం కొనసాగుతూనే ఉంది. సోషల్ మీడియా దిగ్గజం మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యాజమాన్యం) ఈ ఏడాది తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో భారీ మార్పులు చేయాలని నిర్ణయించుకుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మే 20న మెటా తన తొలి విడత లేఆఫ్స్‌ను ప్రకటించనుంది. ఈ ఒక్క విడతలోనే సుమారు 10 శాతం మంది ఉద్యోగులు, అంటే దాదాపు 8,000 మంది తమ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది.

మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఇప్పుడు తన పూర్తి దృష్టిని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై కేంద్రీకరించారు. కంపెనీ అంతర్గత కార్యకలాపాలను ఏఐ టెక్నాలజీతో అనుసంధానించడం ద్వారా సామర్థ్యాన్ని పెంచాలని ఆయన భావిస్తున్నారు.

పెట్టుబడులు: ఏఐ అభివృద్ధి కోసం జుకర్‌బర్గ్ వందల కోట్ల డాలర్లను కుమ్మరిస్తున...