భారతదేశం, ఆగస్టు 20 -- Mega 158: మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్‌కు అఫీషియల్‌గా పూనకాలు తెప్పించే క్రేజీ న్యూస్ వచ్చేసింది. దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ Mega158 టైటిల్ గ్లింప్స్‌ను ఆగస్టు 22న మెగాస్టార్ బర్త్‌డే కానుకగా గ్రాండ్‌గా రివీల్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. "బ్లడీ బెంచ్‌మార్క్" ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ ఊరమాస్ అప్‌డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

'వాల్తేరు వీరయ్య' లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కలయికలో వస్తున్న రెండో సినిమా ఇది. 2023 సంక్రాంతి విన్నర్‌గా నిలిచి వందల కోట్ల వసూళ్లు సాధించిన ఈ కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటంతో ట్రేడ్ వర్గాల్లో భారీ హైప్ నెలకొంది. KVN ప్రొడక్షన్స్ పతాకంపై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ తెరకెక్కుతోంది.

మేకర్స్ గురువ...