భారతదేశం, జూన్ 2 -- వైద్య విద్యార్థులకు భారీ ఉపశమనం కలిగించే కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్​ఎంసీ). ఎంబీబీఎస్ డిగ్రీతో పాటు తప్పనిసరి రొటేటరీ మెడికల్ ఇంటర్న్‌షిప్‌ను పూర్తి చేయడానికి అనుమతించే గరిష్ట కాలపరిమితిని.. ప్రస్తుతం ఉన్న 9 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు పొడిగించాలని ఎన్‌ఎంసీ ప్రతిపాదించింది. 'గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్ (జీఎంఈఆర్) 2023' కి సవరణలు చేస్తూ తెచ్చిన ఈ కొత్త డ్రాఫ్ట్ రూల్ ద్వారా అనారోగ్యం, కుటుంబ అత్యవసర పరిస్థితులు లేదా ఇతర ఊహించని కారణాల వల్ల విద్యా సంవత్సరం నష్టపోయిన విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనపై భాగస్వామ్య పక్షాల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నారు.

నేషనల్ మెడికల్ కమిషన్ విడుదల చేసిన సరికొత్త డ్రాఫ్ట్ సవరణ నిబంధనల ప్రకారం.. వైద్య విద్యార్థులు...