భారతదేశం, నవంబర్ 5 -- Maya Lady Trailer: యువ హీరో రాకేష్ వర్రే ప్రధాన పాత్రలో నటిస్తూ, నిర్మించిన సరికొత్త రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'మాయ లేడీ'. గురువారం (నవంబర్ 5) వైభవంగా జరిగిన ప్రమోషనల్ ఈవెంట్‌లో ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

లవ్, రొమాన్స్, కవల అక్కాచెల్లెళ్ల గందరగోళం, కమెడియన్ సత్య మార్క్ హ్యూమర్‌తో కూడిన ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రసన్నకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

'మాయ లేడీ' స్టోరీ చాలా ఆసక్తికరంగా డిజైన్ చేశారు. ఇందులో లీడ్ రోల్ క్రిష్ (రాకేష్ వర్రే) ఒక నిబద్ధత కలిగిన కరాటే కోచ్. పెళ్లి చేసుకోవడానికి సరైన అమ్మాయి కోసం వెతుకుతున్న క్రిష్‌కి ఆశ (మధుమిత సర్కార్) పరిచయం అవుతుంది. ఆమె క్యూట్ బిహేవియర్,...