భారతదేశం, ఏప్రిల్ 22 -- May Horoscope 2026: ప్రతి నెలా కూడా కొన్ని ముఖ్య గ్రహాల సంచారంలో మార్పులు చూస్తూ ఉంటాం. మే నెలలో కూడా కొన్ని ప్రధాన గ్రహాల సంచారంలో అనేక మార్పులు రాబోతున్నాయి. కొన్ని గ్రహాల సంచారాల వలన రాజయోగాలు కూడా ఏర్పడడం చూస్తూ ఉంటాం. మే నెలలో చూసినట్లయితే, బుధుడు మేష రాశిలో అస్తమిస్తాడు. అలాగే కుజుడు సొంత రాశి అయిన మేష రాశిలోకి అడుగు పెడతాడు. శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. నెల మధ్యలో సూర్యుడు వృషభ రాశిలో సంచారం చేస్తాడు. అలాగే బుధుడు వృషభ రాశిలో ఉదయిస్తాడు.

ఆ తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు రావడంతో 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది. కానీ కొన్ని రాశుల వారు మాత్రం అనేక విధాలుగా లాభాలను పొందుతారు. ఆర్థికపరంగా కలిసి వస్తుంది. కెరీర్‌లో సక్సెస్‌ని చూస్తారు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా ...