భారతదేశం, మే 18 -- May 18: ప్రపంచంలో మరే దేశంలోనూ లేని విధంగా భారతీయులు సినిమాను ప్రాణంగా ప్రేమిస్తారు. ఒకప్పుడు బాలీవుడ్ హవా నడిచినా, ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ చిత్రాలు గ్లోబల్ లెవెల్లో సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఆస్కార్ స్టేజ్ వరకు వెళ్లిన మన సినిమా ప్రస్థానం అసలు ఎక్కడ మొదలైందో తెలుసా? దానికి సమాధానమే మే 18.

సరిగ్గా 114 ఏళ్ల క్రితం, అంటే 1912 మే 18న భారతదేశపు మొట్టమొదటి ఫీచర్ ఫిల్మ్ 'శ్రీ పుండలీక్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాసాహెబ్ తోర్నే (రామచంద్ర గోపాల్ తోర్నే) దర్శకత్వం వహించిన ఈ మూకీ మరాఠీ మూవీ.. హిందూ సాధువు పుండలీకుడి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది.

అప్పట్లో భారతీయ ప్రేక్షకులు కేవలం స్టేజ్ నాటకాలు లేదా విదేశాల నుంచి వచ్చే సినిమాలను మాత్రమే చూసేవారు. ఆ సమయంలో మన వాళ్ల కోసం మనమే ఒక సినిమా తీయాలని తోర్నే బలమైన ...