భారతదేశం, సెప్టెంబర్ 24 -- Matsya Glimpse: టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మైథాలజీ కాన్సెప్ట్ లతో వచ్చే విజువల్ అడ్వెంచర్ సినిమాలకు ఇప్పుడున్న క్రేజ్ వేరు. సరిగ్గా ఇదే టైమ్ లో డెబ్యూ హీరో వివస్వాన్ నటించిన 'మత్స్య' మూవీ గ్లింప్స్ ఆడియెన్స్ ముందుకొచ్చి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. చిన్నపిల్లల బెడ్ టైమ్ స్టోరీలా మొదలై, ఊహకందని డిఫరెంట్ ఫాంటసీ వరల్డ్ లోకి తీసుకెళ్లిన ఈ గ్లింప్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద టాలీవుడ్ గా మారింది.

జీబీఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సంహిత గణపతి ఇంటూరి నిర్మిస్తున్న ఈ భారీ కాన్సెప్ట్ మూవీకి రవి గోలి, తేజ కనకాల సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. కొత్త కుర్రాడు వివస్వాన్ ఈ సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాడు. గ్లింప్స్ లో అతడి బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్ అలాగే ఆటిట్యూడ్ టాలీవుడ్ ఆడియెన్స...