భారతదేశం, జూన్ 26 -- భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ ఎస్‌యూవీల్లో 'మారుతీ సుజుకీ బ్రెజ్జా' ఒకటి. ఇప్పుడీ క్రేజీ కారు సరికొత్త హంగులతో, సరికొత్త రూపంలో మార్కెట్లోకి రావడానికి సిద్ధమవుతోంది. మారుతీ సుజుకీ సంస్థ బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను లాంచ్ చేయడానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. కంపెనీ ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ఈ ఎస్‌యూవీ రోడ్లపై టెస్టింగ్ జరుపుకుంటూ పలుమార్లు కెమెరాలకు చిక్కింది. ఈ టెస్టింగ్ విజువల్స్‌ను బట్టి చూస్తే.. కారు బాహ్య ఎక్స్‌టీరియర్​లో స్వల్ప మార్పులే ఉన్నప్పటికీ, ఫీచర్లు, ఇంజిన్ పరంగా మాత్రం భారీ అప్‌డేట్లే ఉండబోతున్నట్లు స్పష్టమవుతోంది.

మారుతీ సుజుకీ బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌లో రాబోతున్న అతిపెద్ద, ముఖ్యమైన మార్పు దాని ఇంజిన్‌లోనే ఉండబోతోంది. ప్రస్తుతమున్న 1.5-లీటర్ ...