భారతదేశం, నవంబర్ 15 -- భారత ఆటోమొబైల్ మార్కెట్లో డిమాండ్​ని మరింత పెంచుకునేందుకు దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ భారీ వ్యూహాన్ని సిద్ధం చేసింది. 2030 నాటికి దేశీయ ప్యాసింజర్ వాహనాల మార్కెట్లో మళ్లీ 50 శాతం వాటాను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కలను సాకారం చేసుకునేందుకు రాబోయే ఐదేళ్లలో ఏడు కొత్త ఎస్‌యూవీలతో సహా పలు సరికొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకురానుంది. పెట్రోల్, సీఎన్జీ, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వంటి బహుళ ఇంజిన్ విధానాలను అనుసరిస్తూనే, వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 40 లక్షల యూనిట్లకు పెంచుకోనుంది.

తక్కువ నిర్వహణ ఖర్చు, అధిక మైలేజీ కోరుకునే మధ్యతరగతి కుటుంబాలకు మారుతీ సుజుకీ ఎప్పుడూ మొదటి ఎంపికగా నిలుస్తోంది. తాజా ప్రణాళికల్లో భాగంగా 2027 ఫిబ్రవరిలో జరగనున్న 'భారత్ గ్లోబల్ మొబిలిటీ ఎక్స్‌పో' వేదికగా రెండు కీలక కార్లను ఆవిష్కరిం...