భారతదేశం, అక్టోబర్ 6 -- గత దశాబ్దంలో ఎన్నడూ లేని విధంగా మారుతీ సుజుకీ సంస్థ ఈ పండుగ సీజన్‌లో అద్భుతమైన అమ్మకాలు నమోదు చేసింది! జీఎస్టీ కారణంగా ధరలపై ఏర్పడిన సానుకూలత, వినియోగదారుల నుంచి బలమైన డిమాండ్ తోడవ్వడం ఇందుకు ప్రధాన కారణం. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతీ సుజుకీ మునుపటి డెలివరీ రికార్డులను అధిగమించడమే కాకుండా.. బుకింగ్స్, ఎగుమతుల్లో కూడా భారీ వృద్ధిని నమోదు చేసింది. ఇది భారతదేశ ఆటోమొబైల్ రంగంలో విస్తృత స్థాయి పునరుజ్జీవనాన్ని సూచిస్తోంది.

ఈ ఏడాది నవరాత్రి సీజన్ మారుతీ సుజుకీకి ఒక కీలక మలుపుగా మారింది. నవరాత్రి మొదటి ఎనిమిది రోజుల్లో కంపెనీ ఏకంగా 1.65 లక్షల వాహనాలను డెలివరీ చేసింది. దసరా పండుగ నాటికి ఈ డెలివరీలు 2 లక్షలకు చేరాయి. ఈ సంఖ్య గత ఏడాది నవరాత్రి సీజన్ డెలివరీల (సుమారు 1 లక్ష) కంటే రెట్టింపు కావడం విశేషం! మర...