భారతదేశం, జూలై 31 -- Manushi Chhillar NEET: "2015లో జరిగిన నీట్ పేపర్ లీక్ నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.. ఎంబీబీఎస్ సీటు సాధించడం కోసం నాకు ఎంతో ఇష్టమైన ప్రతీ చిన్న సంతోషాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది!" అంటూ మాజీ మిస్ వరల్డ్, బాలీవుడ్ నటి మానుషి చిల్లర్ (Manushi Chhillar) చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ఇటీవల దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల వివాదాలు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ప్రముఖ నటి సోహా అలీ ఖాన్ (Soha Ali Khan) నిర్వహించిన ఒక ప్రత్యేక పాడ్‌కాస్ట్‌లో మానుషి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన మెడికల్ ఎంట్రెన్స్ ప్రిపరేషన్ రోజుల్లో ఎదుర్కొన్న మానసిక వేదనను ఆమె పంచుకున్నారు.

ఈ పాడ్‌కాస్ట్‌లో తన చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. "నీట్ పరీక్ష రాసి రిలాక్స్ అవుతున్న సమయంలో పేపర్ లీక్ అయిందని, మళ్లీ 45 రో...