భారతదేశం, మార్చి 14 -- ఇవాళ యూట్యూబ్ లో ఓ సినిమా ట్రైలర్ రిలీజైంది. మూవీస్ ట్రైలర్ లు రిలీజ్ కావడం కామనే కదా.. ఇందులో స్పెషల్ ఏముంది అంటారా? ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయం కూడా స్పెషలే. కేవలం రూ.33 వేలతో రూపొందించిన సినిమా ఇది. అవును.. ఇది నిజం. ఆ మూవీ పేరు 'మన్ పిశాచ్'.

హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన 'మన్ పిశాచ్' మూవీ ట్రైలర్ ఇవాళ (మార్చి 14) రిలీజైంది. వణికించే సీన్లతో ఈ ట్రైలర్ భయపెడుతోంది. కేవలం రెండు క్యారెక్టర్లతోనే రూపొందించిన సినిమా ఇది. ఓ రాతి గుమ్మటం రహస్యాన్ని ఛేదించేందుకు వెళ్లే ఓ ఆర్కియాలజిస్ట్ కథతో మన్ పిశాచ్ మూవీ సాగుతుంది. ఇందులో యానియా భరద్వాజ్, దీపక్ దామ్లే నటించారు.

సాధారణంగా సినిమాలు తీయాలంటే కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చు అవుతుంది. ఎంత చిన్న సినిమా తీయాలన్నా కనీసం రెండు మూడు కోట్ల రూపాయలు పెట్టాల్సిందే. ఇక భారీ బడ్జెట...