భారతదేశం, ఏప్రిల్ 11 -- Mangli: వరుసగా సూపర్ హిట్ సాంగ్స్ తో తన పాపులారిటీని అమాంతం పెంచుకుంటూ సాగుతున్న సింగర్ మంగ్లీని వివాదాలు కూడా వీడటం లేదు. ఆమె పేరు తరచూ ఏదో ఒక కాంట్రవర్సీలో వినిపిస్తూనే ఉంది. తాజాగా మంగ్లీకి బిగ్ షాక్ తగిలింది. ఆమెపై పోలీస్ కేసు నమోదైంది. మోసం చేసిందనే ఆరోపణలే అందుకు కారణం.

సింగర్ మంగ్లీపై పోలీస్ కేసు నమోదైంది. మైక్రో ఫైనాన్స్ బిజినెస్ పేరుతో రూ.10 కోట్ల మోసం చేశారని లాయర్ సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగ్లీ వల్ల తనకు ప్రాణహాని ఉందని కూడా ఆ లాయర్ ఆరోపించారు. దీంతో పంజాగుట్ట పోలీసులు మంగ్లీపై కేసు నమోదు చేశారు. మంగ్లీతో పాటు ఆమె బ్రదర్, మరో ముగ్గురిపైనా కేసు ఫైల్ చేశారు.

మంగ్లీపై పోలీస్ కేసు బుక్ కావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. మైక్రో ఫైనాన్స్ బిజినెస్ తో ఎక్కువ లాభాలు వస్తాయని మంగ్లీ, ఆమె బ్రదర్ సహా మరి...