భారతదేశం, మే 3 -- Mammootty on Patriot: మలయాళ చిత్ర పరిశ్రమలోని ఇద్దరు దిగ్గజాలు మమ్ముట్టి, మోహన్‌లాల్ సుమారు 13 ఏళ్ల తర్వాత కలిసి నటించిన స్పై థ్రిల్లర్ 'పేట్రియాట్' (Patriot). భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాపై నెట్టింట మిశ్రమ స్పందన వస్తున్న తరుణంలో మెగాస్టార్ మమ్ముట్టి తొలిసారిగా స్పందించారు.

మహేష్ నారాయణన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పేట్రియాట్' సినిమాపై సోషల్ మీడియాలో భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు దీన్ని ఒక అద్భుతమైన స్పై థ్రిల్లర్ అంటుంటే, మరికొందరు ఇంతటి భారీ స్టార్ కాస్ట్‌ను సరిగ్గా వాడుకోలేదని పెదవి విరుస్తున్నారు.

ఈ నేపథ్యంలో దుబాయ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మమ్ముట్టి మాట్లాడుతూ.. "మనం ప్రస్తుతం ప్రైవసీ కనుమరుగవుతున్న కాలంలో ఉన్నాం. ఆ అంశాన్నే మా సినిమా చర్చిస్తుంది" అని పేర్కొన్నారు.

నెగటివ్ రివ్యూల గురించి స్పందిస...