భారతదేశం, అక్టోబర్ 11 -- Mamitha Baiju: ఇటీవల వచ్చిన 'విశ్వనాథ్ అండ్ సన్స్', 'బెత్లెహెం కుటుంబ యూనిట్' లాంటి వరుస బాక్సాఫీస్ హిట్లతో దూసుకుపోతోంది యంగ్ అండ్ టాలెంటెడ్ నటి మమితా బైజు (Mamitha Baiju). ఈ సెన్సేషనల్ బ్యూటీ ఎట్టకేలకు టాలీవుడ్ లో అడుగుపెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) లో భాగమైన మోస్ట్ అవైటెడ్ సూపర్ హీరో ప్రాజెక్ట్ 'జై హనుమాన్' (Jai Hanuman) లో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాక్ నడుస్తోంది.

'ప్రేమలు' (Premalu) చిత్రంతో సౌత్ ఇండియా వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న మమితా బైజు క్రేజ్ మామూలుగా లేదు. 'మాతా పితా మమితా' అంటూ నెట్టింట ఆమె ట్రెండింగ్ లోనే కొనసాగుతోంది. 'జన నాయగన్', 'విశ్వనాథ్ అండ్ సన్స్', 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' వంటి చిత్రాల విజయాలతో మమితా బైజు క్రేజ్ పెరిగింది. కేవ...