భారతదేశం, మార్చి 14 -- మలయాళ ఇండస్ట్రీ నుండి వచ్చే సినిమాలే కాదు వెబ్ సిరీస్‌లు కూడా ఇటీవలి కాలంలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయి. 'సీక్రెట్ స్టోరీస్ రోజ్లిన్' విజయవంతమైన తర్వాత.. ఇప్పుడు మరో ఆసక్తికరమైన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధమైంది. 'కాసరగోడ్ ఎంబసీ' (Kasaragod Embassy) పేరుతో తెరకెక్కిన ఈ జీ5 ఒరిజినల్ సిరీస్.. మార్చి 20 నుండి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మలయాళం క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కాసరగోడ్ ఎంబసీ ఓ నకిలీ పాస్‌పోర్ట్ తయారీ ముఠా చుట్టూ తిరుగుతుంది. 2000వ దశకం నేపథ్యంలో సాగే ఈ వెబ్ సిరీస్.. కేరళలోని కాసరగోడ్ జిల్లాలో జరిగే నకిలీ పాస్‌పోర్ట్ వ్యాపారాన్ని కళ్లకు కట్టేలా చూపించనుంది. అజి, చెమ్ము అనే ఇద్దరు యువకులు ఈ అక్రమ వ్యాపారంలోకి ఎలా ప్రవేశించారు? అసలు కంటే మెరుగ్గా ఉండేలా నకిలీ సర్టిఫికెట్లు, పాస్‌పో...