భారతదేశం, అక్టోబర్ 31 -- Malayalam Thriller I'm Game OTT: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా 'ఐయామ్ గేమ్' కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేసేందుకు సిద్ధమైంది.

"ఆట మొదలవ్వబోతోంది!" అంటూ మేకర్స్ ఐయామ్ గేమ్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు, అలాగే మరోసారి ఈ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌ను ఎంజాయ్ చేయాలనుకునే వారు ఇంట్లోనే కూర్చొని చూసేయొచ్చు.

డిజిటల్ ఆడియన్స్‌కు ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ అందిస్తున్న ప్రముఖ ఓటీటీ సంస్థ జియోహాట్‌స్టార్ (JioHotstar) ఐయామ్ గేమ్ సినిమా డిజిటల్ రైట్స్‌ను దక్కించుకుంది. నవంబర్ 6వ తేదీ నుంచి ఈ క్రేజీ ప్రాజెక్ట...