భారతదేశం, ఆగస్టు 25 -- Malayalam Thriller OTT: కొత్త వారం వచ్చిందంటే ఓటీటీలోకి ఏ మలయాళం సినిమాలు వస్తున్నాయని సెర్చ్ చేసే తెలుగు ఆడియన్స్ చాలా మందే ఉన్నారు. అలాంటివాళ్లకు కిక్కిచ్చే న్యూస్ ఇది. రీసెంట్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ 'ఐ, నోబడీ' ఓటీటీలోకి వచ్చేసింది. ఒకే సారి రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran), పవర్‌హౌస్ నటి పార్వతి తిరువోతు (Parvathy Thiruvothu) కాంబినేషన్‌లో తెరకెక్కించిన సైకలాజికల్ హీస్ట్ థ్రిల్లర్ 'ఐ, నోబడీ' (I, Nobody). ఈ మలయాళం థ్రిల్లర్ ఈ రోజు (ఆగస్టు 25, 2026) డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్‌కు వచ్చింది.

'రోర్‌షాక్' (Rorschach) ఫేమ్ నిసామ్ బషీర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జియోహాట్‌స్టార్ (JioHotstar), సింప్లీసౌత్ (SimplySouth) ప్లాట్‌ఫామ్‌లలో మలయాళంతో ప...