భారతదేశం, ఆగస్టు 27 -- Malayalam OTT Thriller: మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు తెలుగు ఓటీటీ ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ వేరు. పగ, ప్రతీకారం, ఊహించని మలుపులతో కూడిన కథాంశాలతో మలయాళ దర్శకులు ప్రేక్షకులను నిత్యం కట్టిపడేస్తుంటారు. సరిగ్గా ఇదే తరహాలో ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో రూపుదిద్దుకున్న తాజా మలయాళ క్రైమ్ రివెంజ్ డ్రామా 'అంకం అట్టహాసం' (Ankam Attahasam) డిజిటల్ ప్రవేశానికి సిద్ధమైంది.

మలయాళ రివేంజ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ 'అంకం అట్టహాసం' మూడు నెలల తర్వాత ఓటీటీలోకి రాబోతుంది. మే 8, 2026న థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. మరికొన్ని గంటల్లోనే ఓటీటీలో అడుగుపెట్టనుంది.

మలయాళ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అంకం అట్టహాసం స...