భారతదేశం, మే 5 -- Malayalam OTT: థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచిన మలయాళ సినిమా 'భరతనాట్యం 2 మోహినియాట్టం' మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ డార్క్ కామెడీ థ్రిల్లర్ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. బాక్సాఫీస్ దగ్గర మంచి ప్రదర్శన చేసిన ఈ సినిమా డిజిటల్ డెబ్యూ చేయబోతుంది.

మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ భరతనాట్యం 2 మోహినియాట్టం ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఈ డార్క్ కామెడీ థ్రిల్లర్ పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ మే 8 నుంచి ఓటీటీలో అందుబాటులోకి రానుందని నెట్‌ఫ్లిక్స్ ఇవాళ (మే 5) అనౌన్స్ చేసింది.

భరతనాట్యం 2 మోహినియాట్టం మూవీ తెలుగులోనూ ఓటీటీ రిలీజ్ కానుంది. ఈ మలయాళం సూపర్ హిట్ మూవీ తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రానుంది. మలయాళం, తెలుగుతో పాటు తమిళ్...